రంజాన్ సత్కార్యాల సమాహారం

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో రంజాన్ సత్కార్యాల సమాహారం.

1. హాజ్రత్ అబూహురైరా (రజి) ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సఆసం ) ఇలా ఉపదేశించినారు.

” రమజాన్ మాసం రాగానే స్వర్గ ద్వారాలు తెరవబడతాయి, నరక ద్వారాలు మూసివేయబడతాయి. (మరో ఉల్లేఖనంలో స్వర్గద్వారాలకు బదులు ఆకాశ ద్వారాలు, కారుణ్య ద్వారాలు అని ఉంది ) షైతానులు బందించబడతారు”(ముత్తపకు న్ అలైహ్ )

మజాన్ మాసం ప్రారంభంలో దైవప్రవక్త ముహమ్మద్ (సఆసం )తన ప్రసంగాల ద్వారా ప్రజలకు హితభోద చేసేవారు. వారిని జాగృతిపరిచేవారు. అలాంటి ఓ ప్రసంగాన్నే ఇక్కడ పొందుపరుస్తున్నాము.

దైవప్రవక్త (సఆసం ) చేసిన ఈ హితోపదేశాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవాలంటే పాఠకులు ఒక విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. దైవప్రవక్త (సఆసం ) ఎవరిని ఉద్దేశించి హిత బోధన చేసారో వారు నూటికి నూరు శాతం పరిపూర్ణ ముస్లింలు. అలాంటి పరిపూర్ణ విశ్వాసుల్ని మానవ చరిత్ర ఈనాటి వరకు దర్శించలేదు. సాధారణంగా దైవప్రవక్త (సఆసం ) జుమా ప్రసంగాల ద్వారానే ప్రజలకు హితోప దేశం చేసేవారు.
జుమా నమాజు కోసం “మస్జీదే నభవి “(ప్రవక్త మసీదు ) కి వచ్చే ముస్లింలు అణుమాత్రమైనా మచ్చలేని దృఢ విశ్వాసులు : సృష్టికర్తకు తప్ప మరెవరికి తలవంచని గొప్ప దైవభీతి పరాయణులు. అలాంటి విశ్వాసుల్ని సంబోదిస్తూ దైవప్రవక్త ( సఆసం ) హితోపదేశం చేసారు.

రంజాన్ మాసం రాగానే స్వర్గ ద్వారాలు (ఆకాశం లేదా కారుణ్య ద్వారాలు ) తెరవబడతాయి..” అని చెప్పి అయన సంభోదితులకు చెప్పదలుచుకున్నదేమిటంటే, రమజాన్ నెలలో ఎన్ని సత్కార్యాలు చేయగలవో శక్తి వంచన లేకుండా చేసుకోండి.

స్వర్గ దారాలన్నీ మీకోసం తెరుచుకొనే వున్నాయి. ఒకవేళ దాన ధర్మాల ద్వారం గుండా స్వర్గంలోకి వెళ్ళధలుచుకుంటే దాన ధర్మాల ద్వారం గుండానే వెళ్ళండి. రోజా ఉపవాసం ద్వారం గుండా పొదలిస్తే రోజా ద్వారం గుండా వెళ్ళండి. ఖురాన్ పారాయణం ద్వార ప్రవేసించందలిస్తే ఆ మార్గాన్నే వెళ్లి స్వర్గంలో ప్రవేశించండి.

పాపాలకు దూరంగా ఉండి స్వర్గంలోకి వెళ్లదలిస్తే అవిధంగానే వెళ్ళండి.మొత్తం మీద స్వర్గంలోకి ప్రవేశించటానికి అవరమయ్యే అన్నీ మార్గాలు మీకోసం తెరుచుకొని ఉంటాయి. ఇప్పుడిక ” మిమ్మల్ని మీరు స్వర్గ ప్రవేశానికి ఆర్వులు గా మలచుకునే పని మీ చేతుల్లోనే వుంది. ”

స్వర్గ ద్వారాలు తెరవబడతాయి అని చెప్పిన తర్వాత.. నరక ద్వారాలు మోసివేయబడతాయి. అని చెప్పటం జరిగింది.
అంటే ఇతర మాసాల్లో సాధారణంగా జరగటానికి అవకాశమున్న దుష్కర్యాలన్నీ రమజాన్ మాసంలో తగ్గుముఖం పడతాయన్నమాట. ఒక ముస్లిం రంజాన్ పై విశ్వాసం, ఆ మాసంలో చుట్టుపక్కల ఉన్న వాతావరణ ప్రభావం వల్ల దుష్కర్యాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఈ విధంగా నరక ద్వారాలు మూసుకోపోతాయి.
తరువాత.. “షైతానులు బందించబడతారు ‘ అని చెప్పటం జరిగింది. అంటే శుభప్రదమైన ఈ రంజాన్ మాసంలో సత్కార్యాలు అమితంగా పెరిగిపోతాయి. షైతాను చేష్టలతో దుర్మార్గాలు ఆగిపోతాయి. ఎలాగంటే ముస్లింలందరు ఒకేసారి ఉపవాసవ్రతం పాటిస్తారు. ఒక్కొక్కరు ఒక్కో విధంగా రోజా పాటించరు. ముస్లింలందరు ఒకేసారి రోజా పాటిస్తూ దైవం వైపుకు మారలుతారు. కాబట్టి సమాజ వాతావరణంమంతా ఒక్కసారి మారి పోతుంది. ఇలా ఇతర దినాల్లో కనిపించదు. అందుకని మనుషుల హృదయాలు మాటిమాటికి దైవం వైపుకు మారలుతూ ఉంటాయి.

ఒక మనిషి ప్రతిరోజు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు పాటు ఉపవాస దీక్షలో ఉంటాడు. అతడు తాను ఉపావసం వున్నానని, కేవలం దైవం కోసమే రోజా పాటిస్తున్నాననే అనుక్షణం అతడికి గుర్తుకు వస్తూ ఉంటుంది. దైవ సంతోషం కోసమే రోజా పాటిస్తున్నాననే విషయాన్నీ అతడు విస్మరించడు. అందుకని అతడికి దాహం వేసినా నీళ్లు త్రాగడు. ఆకలి వేసినా, తినాలని కోరిక కలిగిన ఆ కోరికను అణిచేసి తినకుండా ఉంటాడు. ఎందుకంటే తాను కేవలం దైవ ప్రసన్నత కోసమే రోజా వ్రతం పాటిస్తున్నాడని అతడికి బాగా తెలుసు. ఈ విధంగా రంజాన్ మాసం అసాంతం మనిషి దైవంతో అత్యంత సన్నిహితంగా ఉంటాడు. దైవం వైపుకె మరలి ఉంటాడు.

రోజా విరమణ సమయంలో.. ఇప్పటి వరకు దైవం తనను ఏమి తినకుండా, తాగకుండా బందించి ఉంచాడు. ఇప్పుడు ఆ బందనాలు విప్పేసి తినటానికి త్రాగటానికి అనుమతిచ్చాడని అతడు భావిస్తాడు.
ఇఫ్తార్ (రోజా విరమణ ) తరువాత భోజనం చేసి కాస్త మెనూ వాల్చాడో లేదా మళ్ళీ లేచి తరావీవ్ నమాజ్ కు వెళ్ళిపోతాడు. దీనితో మళ్ళీ దైవంతో సబంధం మొదలు అవుతుంది. ఈ విధంగా ఇరవై నాల్గు గంటలు దైవంతో అతడి సన్నిహిత్యం నిత్యనూతనంగా ఉంటుంది.

ఈ సంబంధం, ఈ సన్నిహిత్యం ఒక వ్యక్తికే పరిమితం కాదు. యావత్తు ముస్లిం సముదాయం ఏక కాలంలో ఈ అనుబందానుభూతితో పులికించి పునీతమవుతుంది. ఈ విధంగా రంజాన్ మాసం సత్కార్యాల వసంతంగా రూపొందింది.

వర్షాకాలంలో నెల పులకించి ప్రతి వస్తువు పచ్చగా కళకళలాడినట్లు రంజాన్ మాసంలో సత్కార్యాలు అత్యధికంగా గుబాళించటానికి అసంఖ్యాక అవకాశాలు వెతుకుంటూ వస్తాయి. అంటే రంజాన్ సత్కార్యాల సీజన్ అన్న మాట. ఈ సీజన్లోలో ఎవరు ఎంతైనా సంపాదించుకోవచ్చును. ఆధ్యాత్మికంగా, మానసికంగా ఎంత అభివృద్ధి సాదించాలన్నా సాధించవచ్చును.

ఈ మాసంలో ఒకరి సత్కార్యం మరొకరి సహాయకారిగా రూపొందుతుంది. ప్రతి మనిషి మరొక మనిషి రోజాలో సహాయకరిగా నిలుస్తాడు. రంజాన్లో కాకుండా వేరే దినాల్లో రోజా పాటించినట్లయితే ఆ రోజా చాలా భారంగా అనిపిస్తుంది. ఎందుకంటే వేరేవారు అతనికి సహాయకరిగా వుండరు. కానీ రంజాన్ ప్రత్యేకత ఏమిటంటే, ఈ మాసంలో మొత్తం సమాజం ఒకే స్థితిలో ఉంటుంది. ఈ కారణంగా ఒక మనిషికి లక్షలాది మంది సహాయం అందుతుంది. వారి దైవభితి కి, సత్కార్యాభిలాషకు ఎంతో శక్తి లభిస్తుంది.

రంజాన్ మాసంలో మనుషులు ఆధ్యాత్మిక ప్రగతికి, నైతికి విలువలు నిర్మాణానికి అసంఖ్యాక మార్గాలు తెరచుకుంటాయి. బహుశా మీరు చూస్తూనే వుంటారు. ఈ నాటి చెడిపోయిన కాలంలో కూడా ఎవరైనా రంజాన్ మాసంలో దుర్భాషాలకు దిగితే, అయ్యయ్యో! రంజాన్ మాసంలో కూడా ఏమిటి పాడు మాటలు, అనడాన్ని మనం గమనిస్తాం.
అంటే రంజాన్ మాసపు ఔనత్యం, ప్రాముఖ్యతలను గురించిన స్పృహ ఈనాటి సమాజానికే ఇంత మెండుగా ఉందంటే ఇస్లాం ప్రారంభందశలో ఏ స్థాయిలో ఉందొ మనం ఊహించవచ్చును.
ఈ కారణంగానే రంజాన్ మాసంలో స్వర్గ ద్వారాలు తెరవ బడతాయని, నరక ద్వారాలు ముసివేయబడతాయని, షైతానులు బందించబడుతారని, పెర్గోనటం జరిగింది ఇక్కడ మనం ఒక విషయాన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. ఈ హితోపదేశం ఒక చక్కని ముస్లిం సమాజం. చక్కని వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని చేయబడింది. ఆలా కాకుండా ఒకవేళ ఎవరైనా షిర్కే బహు దైవారాధనతో పాటు.. అనేక ఇతర పాపాల్లో కురుకోపోయి ఉన్నట్లయితే అలాంటి వారి కోసం నరక ద్వారాలు తెరిచి ఉంటాయి. స్వర్గ ద్వారాలు మూసుకోపోతాయి అని గ్రహించాలి.

 

–షేక్.బహర్ అలీ
ఆయుర్వేద వైద్యుడు
సెల్‌: 73961 26557

Leave A Reply

Your email address will not be published.