ఖమ్మం జిల్లాలో ప్రమాదానికి గురైన కళాశాల బస్సు.. 10 మందికి గాయాలు

అశ్వారావుపేట (CLiC2NEWS): ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నుండి వెళ్తున్న ఓ కళాశాల బస్సు అదుపు తప్పి పల్టీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి గాయాలయ్యాయి. బస్సు అశ్వారావు పేట- పాపిడిగూడెం మార్గంలో ఉన్న అడవిలో అదుపు తప్పి ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. గాయాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు, 10మంది బోధనా సిబ్బంది ఉన్నట్లు సమాచారం.