గ్యారేజీలో మంటలు వ్యాపించి 22 బస్సులు దగ్థం..

బెంగళూరు (CLiC2NEWS): నగరంలోని ఓ గ్యారేజిలో మంటలు చెలరేగి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 22 బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. వీరభద్ర నగర్‌లోని గ్యారేజిలో బస్సులకు వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవ్వరికీ ఎటువంటి హాని జరగలేదు. కానీ పార్కింగ్ చేసిన 22 బస్సులు దగ్థమయ్యాయి. సమాచారం అందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమయంలో గ్యారేజిలో మొత్తం 35 బస్సులు ఉన్నాయి. వీటిలొ 18 బస్సులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మరో నాలుగు పాక్షికంగా దెబ్బతిన్నట్లు సమాచారం. మంటలు పెద్దఎత్తున ఎగసిపడుతూ ఆప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకొన్నాయి.