యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొన్న గ్యాస్ సిలిండర్ల లారీ!

తుని (CLiC2NEWS): కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యాసిడ్ ట్యాంకర్‌ను వెనుక నుండి వస్తున్న గ్యాస్ సిలిండర్ల లారీ ఢీకొట్టింది. దీంతో యాసిడ్ లీకై బయటకు రావడంతో ఆప్రాంత మంతా దుర్వాసనతో కూడిన దట్టమైన పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనతో వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.