ఆదోని: పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం.. రూ.8 కోట్ల పైనే నష్టం
ఆదోని (CLiC2NEWS): కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోని పత్తి మిల్లులో బుధవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.8 కోట్ల నష్టం వాటిల్లినట్టు సమాచారం. పట్టణంలోని సంతోష్ పత్తి జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్లులో బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది. దాదాపు 8 కోట్ల విలువైన పత్తి, పత్తి బేళ్లు, పత్తి గింజలు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. పత్తి మిల్లు కావడంతో మంటలు వేగంగా అలుముకున్నాయి. భారీ ఎత్తున్న మంటలు ఎగసి పడి , దట్టమైన పొగవ్యాపించింది. ఈ ఘటనలో రెండు ట్రాలీ ఆటోలు దగ్థమయ్యాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.