ఏలూరులో ప్రైవేటు కాలేజ్ బస్సు బోల్తా..

ఏలూరు (CLiC2NEWS): ఓ ప్రైవేటు జూనియర్ కాలేజ్‌కు చెందిన బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఏలూరు సమీపంలోని చోదిమెళ్ల వద్ద విద్యార్థులను కాలేజ్ నుండి తీసుకెళ్తున్న బస్సు రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ప్రమాద సమయంలో 40 మంది విద్యార్థులు ఉన్నారు. వెంటనే స్పందించిన స్థానికులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.