వీరభద్రస్వామికి వెండి ఆభరణం విరాళంగా ఇచ్చిన తానా మాజీ అధ్యక్షడు
ఖమ్మం (CLiC2NEWS): తానా మాజీ అధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్ వీరభద్రస్వామికి వెండి ఆభరణాన్ని విరాళంగా అందజేశారు. బూర్గంపాడు మండలం మోతెగడ్డలో ఉన్న భద్రకాళి సమేత వీరభద్రస్వామికి జయశేఖర్-నీలిమ దంపతులు శుక్రవారం వెండి ఆభరణం అందజేశారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనితారాణి, వల్లూరి వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.