కాపీ కొట్టాడని మందలించడంతో విద్యార్థి ఆత్మహత్య..

సిద్ధిపేట (CLiC2NEWS): లోని జిల్లా చేర్యాల మండలంలో ఓ విద్యార్ధి మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తనను ప్రిన్సిపాల్‌తో పాటు తన తండ్రి కూడా కొట్టడంతో ఆ విద్యార్థి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చేర్యాల మండలం శభాష్ గూడెం గ్రామనికి చెందిన 8వ తరగతి చదువున్న విద్యార్థి.. పాఠశాలలో జరిగిర పరీక్షలో కాపీ కొడుతున్నాడని గమనించిన ప్రిన్సిపల్ కొట్టడంతో పాటు తండ్రికి ఫిర్యాదు చేశాడు. అతను వచ్చి విద్యార్థులందరి ముందు కొట్టాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆ విద్యార్ధి గ్రామ శివారున్న వ్యవసాయ బావి వద్ద ఉన్న చెట్టుకి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.