కామారెడ్డిలో ట్రిబుల్ ఇంజన్ సర్కారు రావాలి
-కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి
కామారెడ్డి (CLiC2NEWS): కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా జిల్లా మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి లో ట్రిబుల్ ఇంజన్ సర్కారు రావాలనీ అన్నారు. ప్రతి వార్డులో బీజేపీ కౌన్సిలర్ లను గెలిపించి బీజేపీ అభ్యర్థిని చైర్మెన్ చేస్తే ఎమ్మెల్యేతో కలిపి ట్రిబుల్ ఇంజన్ సర్కారు వస్తుందని అప్పుడు ఏ ఆటంకం లేకుండా అభివృద్ధి అవుతుందని అన్నారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తుందనీ ప్రతి వార్డులో బీజేపీ కార్యకర్త గెలుపు కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Also Read: మున్సిపల్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాం
[…] కామారెడ్డిలో ట్రిబుల్ ఇంజన్ సర్కారు… […]