అమీర్‌ఖాన్ 15 ఏండ్ల బంధానికి తెర‌

విడాకులు తీసుకుంటున్న అమీర్‌ఖాన్ దంప‌తులు

ముంబయి (CLiC2NEWS): బాలీవుడ్ స్టార్ క‌పుల్ అమీర్‌ఖాన్‌-కిర‌ణ్‌రావు విడిపోతున్నారు. 15 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి చెబుతున్న‌ట్లు శ‌నివారం ఈ దంప‌తులు అధికారికంగా ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు తాము విడాకులు తీసుకున్నామంటూ అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు సంయుక్తంగా ఒక అధికారిక ప్ర‌క‌ట‌న చేశారు. అమీర్‌ఖాన్ ప‌దిహేనేండ్ల క్రిత‌మే మొద‌టి భార్య‌తో విడిపోయి కిర‌ణ్‌రావు రెండో వివాహం చేసుకున్నారు.

మొద‌ట అమీర్‌ఖాన్ 1986లో రీణా ద‌త్తాను మొదటి వివాహం చేసుకున్నారు. వారికి కూతురు ఇరా ఖాన్‌, కుమారుడు జునైద్ ఖాన్ ఉన్నారు. 2002లో అమీర్‌ఖాన్‌, రీణా ద‌త్తాలు త‌మ వైవాహిక బంధానికి తెర‌దించారు. 2005లో కిర‌ణ్ రావును రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఆజాద్ ఖాన్ అనే కుమారుడు ఉన్నారు.

వీరు విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో..

‘మా 15 సంవత్సరాల వైవాహిక జీవితంలో జీవితానికి సరిపడే అద్భుతమైన అనుభవాలను, సంతోషాల‌ను, ఆనందాల‌ను పంచుకున్నాం. మా బంధం నమ్మకం, గౌరవం, ప్రేమ అనే పునాదుల మీద నిల‌బడింది. అయితే ఇప్పుడు మేం మా జీవితాల్లో కొత్త అధ్యాయాల‌ను ప్రారంభించ‌బోతున్నాం. మేమిద్దరం ఎక్కువ కాలం భార్య, భర్తలుగా ఉండలేదు. మా బిడ్డకు తల్లితండ్రులుగా ఉంటూనే వేర్వేరుగా జీవించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.