Mandapeta: పట్టణ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత

పట్టణంలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తే చర్యలు..
పందుల పెంపకం దార్లకు హెచ్చరికలు జారీ చేసిన చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి..

మండపేట (CLiC2NEWS): వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని పట్టణంలో పందులు విచ్చలవిడిగా సంచరిస్తే పందుల పెంపకందార్లపై చర్యలు తప్పవని మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ దుర్గారాణి పేర్కొన్నారు. పందుల ఆవాస కేంద్రాలు ఎక్కువగా ఉండే 26 వ వార్డులో ఉన్న పందుల పెంపకం దారులకు మున్సిపల్ అధికారులకు అవగాహన కల్పించారు. చైర్ పర్సన్ దుర్గారాణి ఆదేశాల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్తిరాజు, సిబ్బంది రామకృష్ణ, రామన్నలు పందులు రోడ్ల మీదకు వచ్చి చెత్త చెదారాలను చెండాలం చేస్తే పందులను మున్సిపాలిటీ తీసుకెళ్ళి పోతుందని చెప్పారు. ప్రజారోగ్యాన్ని భంగం కలిగించే విధంగా పందులను వీధుల్లోకి వదిలితే పందులను అప్పగించేది లేదని హెచ్చరించారు. రామచంద్రుడు కాలువ గట్టు వద్ద ఉన్న పందుల పెంపకం దారులు పందులను మేతకు వదిలే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్యలు ఉంటాయన్నారు. ఇప్పటికే పలుచోట్ల పందులు బీభత్సం చేసి అపరిశుభ్ర వాతావరణాన్ని సృష్టిస్తున్నాయని తమకు ఫిర్యాదులు అందాయన్నారు. అందుచేత పందులను మున్సిపాలిటీ సూచించిన సమయాల్లో మాత్రమే పందులను బయటకు వదలాలని చెప్పారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ రాణి మాట్లాడుతూ పట్టణ ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇందుకు సంబంధించి పారిశుధ్య నిర్వహణ మెరుగుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో పందుల పెంపకం దారులు అధికారుల ఆదేశాలు పాటించక పోతే ప్రజారోగ్యాన్ని ద్రుష్టిలో పెట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.