రూ.10 లక్షల డ్వాక్రా సొమ్ముతో పరారైన మహిళ
![](https://clic2news.com/wp-content/uploads/2023/07/currency-images.jpg)
తోట్లవల్లూరు (CLiC2NEWS): నెలనెల పొదుపు చేసుకుంటున్న డ్వాక్రా డబ్బుల తన సొంతపనికి వాడుకొని పరారైన ఘటన కృష్ణా జిల్లాలో తోట్లవల్లూరు మండలం పెనమకూరు గ్రమంలో చోటుచేసుకుంది. డ్వాక్రా గ్రూపు కార్యదర్శి సభ్యులు ఇచ్చిన డబ్బులు బ్యాంకులో డబ్బులు జమ చేయకుండా పై గ్రూపు సభ్యులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంజు గ్రూపు లోని సభ్యులు 2021లో స్టేట్ బ్యాంకు నుండి రూ. 10 లక్షలు లోన్ తీసుకుని .. నెలనెలా రూ. 34.100 చొప్పున బ్యాంకులో జమచేయాలని 25 నెలలు కార్యదర్శి కొల్లిపర ఉమాశ్రీకి ఇచ్చారు. మొత్తం రూ. 8,52,500 సొంత పనికి వాడుకొనగా.. ఇప్పుడది వడ్డీతో సహా రూ. 12,68,000 అయ్యింది. రెండేళ్ల నుండి డబ్బులు కట్టడం లేదని బ్యాంకు అధికారులు ఎందుకు అడగలేదో అర్ధం కావడంలేదంటున్నారు. అనంతరం ఈ విషయం మండల ఎపిఎం దృష్టికి తీసుకెళ్లగా.. కార్యదర్శి ఉమశ్రీ పొలం అమ్మి చెల్లిస్తానని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే.. ఇటీవల పొలం అమ్మగా వచ్చిన డబ్బుతో గ్రామం విడిచి వెళ్లిపోయినట్లు, ఆమెకు సహకరించిన వారిపై కూడా చర్యలు తీసుకోవానలి గ్రూపు అధ్యక్షురాలు, సభ్యులు పోలీసులను ఆశ్రయించారు.