కడుపులో దూది వదిలేసి కుట్లు వేసిన వైద్యులు.. బాలింత మృతి
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
అచ్చంపేట (CLiC2NEWS): వైద్యుల నిర్లక్ష్యం ఓ పసిబిడ్డకు తల్లిని దూరం చేసింది. తనకు పుట్టబోయే బిడ్డ కోసం ఎంతో ఆశగా ఎదురుచూసిన ఆ తల్లి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోయింది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 15వ తేదీన ఓ మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన వైద్యులు కడుపులో దూది మర్చిపోయి కుట్లు వేశారు. అరంతకం ఆమెను డిశ్చార్జి చేశారు. తర్వాత వారం రోజులకు కడుపులో నొప్పితో తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబసభ్యులు ఆమెను అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి ప్రైవేటు ఆస్పత్రికి సిఫార్సు చేశారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి.. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె మృతి చెందింది. దీంతో అచ్చంపేట ఆస్పత్రి వద్ద కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు.