Accident: రోడ్డు ప్రమాదంలో ఐదుగురి దుర్మరణం

లక్నో (CLiC2NEWS): యుపి రాష్ట్రంలోని ఫతేపూర్‌లోని చౌరాసి ప్రాంతంలో అతి వేగంగా దూసుకువచ్చిన ఎస్‌యూవీ వాహనం నియంత్రణ కోల్పోయి రెండు ద్విక్ర వాహనాలు, సైకిలిస్ట్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి సహా ఐదుగురు మృతి చెందారని పోలీసులు పేర్కొన్నారు. బైక్‌లు, సైకిల్‌ను ఢీకొట్టిన అనంతరం ఎస్‌యూవీ చెట్టును ఢీకొట్టింద‌ని ఎస్పీ ఆనంద్‌ కులకర్ణి తెలిపారు. ఈ ప్ర‌మాదంలో మరో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని తెలిపారు. ఈ ఘ‌టనలో మరణించిన వారిలో ఒకే కుటుంబానికి చెందిన వారే ముగ్గురు రాకేశ్‌ (35), అతని తండ్రి రాజారామ్‌ (65), రితిక్‌ (5)గా గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన మరో ఇద్దరిని ఆశిష్ (25), సౌరభ్ (38)గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్ర‌మాదంపై యుపి సిఎం యోగి ఆదిత్యనాథ్‌ విచారం వ్యక్తం చేశారు. మృతులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా, గాయపడ్డ వారికి రూ.50వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

Leave A Reply

Your email address will not be published.