బాపట్ల కేంద్రీయ విద్యాలయం సైన్స్‌ల్యాబ్‌లో ప్రమాదం.. 24 మంది విద్యార్థులకు అస్వస్థత
గుంటూరు (CLiC2NEWS): సైన్స్‌ల్యాబ్ జరిగిన ప్రమాదం కారణంగా 24 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటన బాపట్లలో చోటుచేసుకుంది. బాపట్ల కేంద్రీయ విద్యాలయంలో శనివారం ఆరోతరగతి విద్యార్థులు చేసిన ప్రయోగం వికటించి విషవాయువులు విడుదలయ్యాయి. క్లోరోఫిల్ యాసిడ్, నిమ్మ ఉప్పుతో ప్రయోగం చేసి విద్యార్థలకు టీచర్ విద్యార్థులకు చూపించారు. టీచర్ బయటకు వెళ్లగానే ఆ మిశ్రమానికి కొందరు విద్యార్థులు కాఫీపొడి, ఉప్పు పంచదార, శానిటైజర్ కలపడంతో ఒక్కసారిగా విషవాయువులు వెలువడ్డాయి. దీంతో ఊపిరాడక వారంతా బయటకు పరుగులు తీశారు. ల్యాబ్‌లో ఉన్న విద్యార్థులు అస్వస్థతకు గురవడంతో ఉపాధ్యాయులు వారిని అస్పత్రికి తరలించారు.