రాజ‌కీయాల‌కు స్వ‌స్తి.. అలీ

అమ‌రావ‌తి (CLiC2NEWS):  వైఎస్ ఆర్‌సిపికి సినీన‌టుడు అలీ రాజీనామా చేశారు. అంతేకాక ఆయ‌న రాజ‌కీయాల‌నుండి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇక‌పై నేను ఏ రాజ‌కీయ పార్టీ మ‌నిషిని కాద‌ని.. ఏ పార్టీ మ‌ద్ద‌తుదారుడినీ కాద‌న్నారు. నా సినిమాలు నేను చేసుకుందామ‌నుకుంటాన్నాన‌ని అయ‌న తెలిపారు. ప్ర‌తి ఐదేళ్లకోసారి సామాన్యుడిలా ఓటు వేసి వ‌స్తాన‌న్నారు. అలీ ఇప్ప‌టివ‌ర‌కు వైఎస్ ఆర్‌సిపిలో ప్ర‌భుత్వ స‌ల‌హాదారుడిగా ఉన్న విష‌యం తెలిసిందే.
1999లో మా పెద్దాయ‌న డి. రామానాయుడి కోసం రాజ‌కీయాల్లో అడుగు పెట్టాన‌ని.. ఆయ‌న బాప‌ట్ల నుండి ఎంపిగా పోటీచేసిన‌పుడు ప్ర‌చారం చేయాలంటే.. టిడిపిలోకి వెళ్లార‌న్నారు. దాదాపు 20 ఏళ్లు పార్టీలో ఉన్న‌ట్లు.. త‌ర్వాత వైఎస్ ఆర్‌సిపిలోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. తాను రాజ‌కీయాలు చేసేందుకు రాలేద‌ని.. నేను చేస్తున్న దాతృత్వ కార్య‌క్ర‌మాల‌కు రాజ‌కీయం తోడైతే మ‌రో ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌వ‌నే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్లు తెలిపారు. నేను ఏ పార్టీలో ఉన్నా పార్టిని, నాయ‌కుడిని పొగిడానే త‌ప్ప‌, ఇత‌ర పార్టీ నాయ‌కుల‌ను విమ‌ర్శించ‌లేద‌న్నారు. 45 ఏళ్ల‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ఆయ‌న‌.. దాదాపు 12 వంద‌ల‌కు పైగా సినిమాల్లో నటించారు.

Leave A Reply

Your email address will not be published.