15 కెజిల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ నటి

బెంగళూరు (CLiC2NEWS): బెంగళూరు విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు దాదాపు 15 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కన్నడ నటి రాన్యా రావ్ బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. దుబాయ్ నుండి బంగారాన్ని తీసుకొస్తుండగా డిఆర్ఐ అధాకారులు ఆమెను అరెస్టు చేశారు. ఇటీవల రాన్యా తరచూ దుబాయ్ వెళ్లి వస్తుండటంతో ఆమెపై నిఘా పెట్టినట్లు సమాచారం. గత 15 రోజుల్లో నటి 4 సార్లు దుబాబ్ వెళ్లొచ్చారు. ఎవరికీ ఎటువంటి అనుమానం కలగకుండా గోల్డ్ బిస్కెట్‌లను దుస్తుల్లో దాచి, తీసుకొచ్చేవారని అధికారులు తెలిపారు. కిచ్చా సుదీప్ హీరోగా నటించిన మాణిక్య చిత్రంతో రాన్యా రావ్ తెరంగేట్రం చేశారు. తర్వాత వాఘా, పటాకీ చిత్రాల్లో నటించారు.