NIMS: మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపి కోర్సుల్లో ప్రవేశాలు
![](https://clic2news.com/wp-content/uploads/2023/09/PHYSIOTHERAPIST.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): నగరంలోని నిమ్స్‌లో ఎంపిటి కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు బిపిటి కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. డిసెంబర్ 31 నాటికి 22 నుండి 35 ఏళ్లలోపు ఉండాలి. మొత్తం సీట్ల సంఖ్య 15. న్యూరోసైన్స్, కార్డియోవాస్కులర్ అండ్ పల్మనరీ విభాగాలలోని ఎంపిటి ప్రవేశాలకు ఎంట్రన్స్ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. నవంబర్ 2వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు https://www.nims.edu.in వెబ్‌సైట్ చూడగలరు.