శాసన సభ నుండి ఎంఐఎం సభ్యులు వాకౌట్
ఇది గాంధీ భవన్‌కాదు.. శాసనసభ ఎమ్మెల్యే అక్బరుద్ధీన్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం శాసన సభ నుండి ఎంఐఎం సభ్యులు వాకౌట్ చేశారు. సభను నడపడంలో సర్కార్ విఫలమైందని .. సభ నడుపుతున్న తీరును నిరవసిస్తూ ఎంఐఎం సభ్యులు బయటకు వచ్చారు. సభలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తారా..అంటూ మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభను నడపడంలో ప్రభుత్వం విఫలమైందని, ఇది గాంధీ భవన్ కాదు.. తెలంగాణ శాసనసభ అని ఆయన వ్యాఖ్యానించారు.