శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానాలు రద్దు..
![](https://clic2news.com/wp-content/uploads/2022/01/AIR-INDIA.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): శంషాబాద్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సోమవారం పలు విమానాలను రద్దు చేసింది. సమాచారం అందకు ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రయాణికులు ఆందోళనకుగురయ్యారు. సాంకేతిక కారణాల వలన హైదరాబాద్ నుండి రాకపోకలు సాగించే పలు విమానాలను ఎయిర్ ఇండియా రద్దుచేసింది. అయితే ఈ సమాచారం అందక విమానాశ్రయంకు చేరుకున్న ప్రయాణికులు సంబంధిత అధికారలత వాగ్వాదానికి దిగారు. తమ సమయం వృథా చేశారంటూ.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డబ్బులు తిరిగి ఇస్తామనడంతో వారు వెనుదిరిగినారు.