దేశ రాజధానిలో పడిపోయిన గాలి నాణ్యత
న్యూఢిల్లీ (CLiC2NEWS): దీపావళి తర్వాత మంగళవారం ఢిల్లీ లో వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది. దీపావళి కి ముందు రెండు రోజులతో పోల్చి చూస్తే గాలిలో కాలుష్యం దారుణంగా నమోదైంది. గాలి నాణ్యత సూచి 491గా నమోదైంది.
దీవావళి బాణాసంచా కాల్చడం, ఢిల్లీ చుట్టు పక్కన గల మధ్య ప్రదేశ్, పంజాబ్ లో పలు ప్రాంతాల్లో వ్యవసాయ వ్యర్థాలు తగలబెట్టడం వల్ల వాయు కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని పిసిబి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ క్రమంలో దీపావళి రోజున రాత్రి 8 గంటల నుచండి 10 గంటల మధ్యన ఢిల్లీలో కేవలం గ్రీన్ క్రాకర్స్‌తో మాత్రమే జరుపుకోవాలని సుప్రీం కోర్టు అనుమతిని ఇచ్చింది.
కానీ కోర్టు ఆదేశాలను ప్రజలు పూర్తిగా ఆచరించినట్లు కనిపించడం లేదు. బాణా సంచా కాల్చడం దాదాపు అర్థరాత్రి వరకూ కొనసాగాయి. దాంతో ఢిల్లీలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోయింది.
దీంతో పాటు ఢిల్లీలో పొగ మంచు, నిర్మాణ వ్యర్థాల ప్రభావం కూడా వాయు కాలుష్యానికి కారణంగా ఉన్నాయని అధికారులు అంటున్నారు.
Also Read: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఎపిలో ఎల్లో అలెర్ట్
[…] […]