పెద్దపల్లి జిల్లా ఇంచార్జి డిసిపిగా అఖిల్ మహాజన్ బాధ్యతలు స్వీకరణ

రామగుండం (CLiC2NEWS): పెద్దపల్లి జిల్లా ఇంచార్జి డిసిపిగా అఖిల్ మహాజన్ (ఐపీఎస్) బాధ్యతలను స్వీకరించారు. పెద్దపల్లి డిసిపిగా పనిచేసిన పి. రవీందర్ చీఫ్ ఆఫీస్ హైదరాబాద్‌కి అటాచ్‌గా వెళ్లగా.. ప్రస్తుతం రామగుండం డిసిపి అడ్మిన్‌గా పనిచేస్తున్న అఖిల్ మహాజనకు పెద్దపల్లి ఇంచార్జి డిసిపిగా అధనపు బాధ్యతలను అప్పగిస్తూ రామగుండం కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి (ఐజీ) ఉత్తర్వులను జారీ చేశారు. ఇంచార్జి డిసిపిగా వచ్చిన అఖిల్ మహాజన్ ను పలువురు పోలీస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు.