నవభారత లైయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదానం

హైదరాబాద్ (CLiC2NEWS): నవభారత లైయన్స క్లబ్ ఆధ్వర్యంలో 200 మంది పేదలకు ఆదివారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. లైయన్ సి.హెచ్.గోపాలకృష్ణ గారి అబ్బాయి వెంకట వంశీ పెళ్లి రోజు, మణి వికాస పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎవరికి ఏ అపద వచ్చినా మేమున్నాం అంటూ ముందుకు వచ్చెదే లయన్స్ క్లబ్ అని అధ్యక్షుడు లైన్ జె.టి.విద్యా సాగర్ అన్నారు. కష్టంలో ఉన్న వారికి ఏసాయం కావాలన్నా మేము న్నాం.. అని ధైర్యం చేప్పి , ఎందరికో స్పూర్తిగా నిలిచేదే లైయన్స్ క్లబ్ అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లైయన్ డా.హిప్నో పద్మా కమలాకర్, లైయన్ పి.స్వరూప రాణి, సి.హెచ్.సుజాత, పావని, లైయన్ కోశాధికారి రమణయ్య, లైయన్ వి.జె.క్యార్లిన్, మొదట, ఉపాధ్యక్షులు లైన్ గోపాల్ కృష్ణ, లైన్ హర్ష, , క్లబ్ జిల్లా చైర్మన్ లైన్ ఎన్.రామ్ ప్రసాద్ రావు, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.