మిత్రుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత

మంచిర్యాల (CLiC2NEWS): తమతోపాటు 10వ తరగతి వరకు చదువుకున్న మిత్రడు అకాల మరణం చెందడంతో తోటి స్నేహితులు కలత చెందారు. మిత్రుని కుటుంబానికి అండగా నిలబడ్డారు… కుటుంబ సభ్యులకు రూ. 25,000/- లు అందజేశారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన దక్షిణామూర్తి ఈ మధ్యకాలంలో చనిపోయారు. ZPHS జైపూర్ 2000 సంవత్సరంలో తమతో పాటు పదవ తరగతి వరకు చుదువుకున్న మిత్రుని మరణాన్ని తోటి స్నేహితులు తట్టుకోలేక పోయారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం వెంకటాపపూర్ గ్రామంలో మిత్రుని (దక్షిణామూర్తి) ఇంటికి వెళ్లి స్నేహితులంతా కలసి రూ. 25,000 అందజేశారు. తన భర్త స్నేహితులు అందించిన సహాయం పట్ల భార్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్‌పిహెచ్ ఎస్ జైపూర్ 2000 వ సంవత్సరపు పూర్యవిద్యార్థులు అరిగెల శ్రీనివాస్ గౌడ్. కెమెరా మల్లేష్, బరిబద్దల రమేష్, వెంకట స్వామి, కే తిరుపతి, తులసీరామ్ వేణు, జి తిరుపతి తదితర స్నేహితులు పాల్గొన్నారు.