అంబేద్క‌ర్ వ‌ర్సిటి డిగ్రి ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 18 నుండి ..

హైద‌రాబాద్(CLiC2NEWS) : డా.బి.ఆర్‌. అంబేద్య‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటి డిగ్రి ప‌రీక్ష‌ల తేదీల‌ను అధికారులు వెల్ల‌డించారు. మొద‌టి సంవ‌త్స‌రం రెండో సిమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 27 నుండి ఫిబ్ర‌వ‌రి 2వ తేదీవ‌ర‌కు, డిగ్రి రెండో సంవ‌త్స‌రం నాల్గ‌వ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌లు జ‌న‌వ‌రి 18వ తేదీ నుండ 24వ తీదీ వ‌ర‌కు జ‌రుగుతాయి. ఈ ప‌రీక్ష‌ల‌కు హాజ‌ర‌య్యే విద్యార్థులు వెబ్‌సైట్ ‌www.braouonline.in లో వివ‌రాల‌ను న‌మోదు చేసుకోవాలి. ప‌రీక్షా ఫీజును T.S / A.P ఆన్ లైన్ సెంటర్లు ద్వారా లేదా డెబిట్ /క్రెడిట్ కార్డ్ తో మాత్రమే చెల్లించాలి. ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ డిసెంబర్ 23.  పరీక్ష సమయము మధ్యాహ్నం 2 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వారి సంబంధిత ఆధ్యయన కేంద్రాల‌లో లేదా 23680241/254 ఫోన్ నంబర్ల ద్వారా సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.