America: ఫ్లోరిడాలో కాల్పులు.. ముగ్గురు మృతి
మియామీ (CLiC2NEWS): అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలోని ఓ దుకాణంలో జరిగిన కాల్పులలో చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. ఉత్తర మియామీకి 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాయల్ పామ్ బీచ్ వద్ద గల పబ్లిక్స్ గ్రాసరీ స్టోర్లో గురువారం కాల్పులు జరిగాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికే ముగ్గురు మృతి చెంది ఉన్నారని వారు చెప్పారు. మృతి చెందిన వారిలో ఒక షూటర్ కూడా ఉన్నట్లు తెలిపారు. మరో మహిళతో పాటు చిన్నారి చనిపోయారని చెప్పారు.