అమ్మా.. నీ రూపం…??

తల్లికి రూపం కావాలా..?

కొత్త రూపం ఇవ్వాలా

కొత్త గీతం రాయాలా

మరో తల్లి కోసం తపన పడాలా

పురిటి నొప్పుల తల్లికి

ఆయాసం, శ్వాసతీయటం నేర్పాలా

లాలించి, ముద్దాడిన తల్లికి మళ్ళీరూపం ఇవ్వాలా

నవమాసాలు మోసి పసిద్ధ అయిన తల్లికి ఏ కొడుకయితే నేమి…

తొలి చూలి బాలింతకు తన పొత్తిళ్లలో ఉంది

చంద్ర వదనుడయినా….

సూర్య తేజుడై నా…

కురూపిఐనా ఒక్కటే కదా

ఓ నా బిడ్డలారా…

మీ తల్లి రూపు కోసం కాట్లాటలు, కోట్లాటలు ఎందుకు??

నారూపం ఏదయితే నేమి

వీరత్వం, ధీరత్వం పుణికి పుచ్చుకున్న నా బిడ్డలారా

మిమ్మల్ని గన్న తల్లినిరా నేను బహురూపుల తల్లిని కాదురా.. ..

ప్రేమ గల దాన్నిరా…

మాటి మాటికి నా రూపం మార్చకురా

మమ కారం మరువకురా

ఓ నా బిడ్డలారా

నేనొక ముద్ద బంతి పువ్వునురా..

పొద్దు తిరుగుడు పువ్వునురా…

అన్నీ కలబోసిన బతుకమ్మనురా..

బతుకండి బిడ్డలారా..

నా రూపం కోసం కాదు రా

నా కన్న బిడ్డలుగా

వెలుగులు పంచే దివ్వెలుగా…

-ఎస్. వి.రమణా చారి జర్నలిస్ట్ 

సెల్‌: +91 98498 87086

Leave A Reply

Your email address will not be published.