తుర్కియోలో మ‌రోసారి భూకంపం.. రిక్ట‌ర్ స్కేలుపై 6.4గా న‌మోదు

అంకారా (CLiC2NEWS): తుర్కియో, సిరియా దేశాలు భారీ భూకంపం ధాటికి అత‌లాకుత‌ల‌మైపోయాయి. మృతుల సంఖ్య 45 వేల‌కుపైగా దాటిపోయిన విష‌యం తెలిసిందే. తాజాగా తుర్కియోలో మ‌రోసారి భూకంపం వ‌చ్చింది. హ‌తాయ్ ప్రావిన్స్‌లో సోమ‌వారం 6.4 తీవ్ర‌త‌తో భూమి కంపించింది. భూకంప కేంద్ర డెఫ్నె న‌గ‌ర స‌మీపంలో ఉన్న‌ట్లు తుర్కియో విప‌త్తు నిర్వ‌హ‌ణ సంస్థ ప్ర‌క‌టించిన‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టికే బ‌ల‌హీన ప‌డిన కొన్ని భ‌వ‌నాలు ఈ భూకంపం వ‌ల‌న కూలిపోయాయి. ప్రాణ న‌ష్టానికి సంభందించిన స‌మాచారం తెలియ‌లేదు.

Leave A Reply

Your email address will not be published.