మన్యం జిల్లాలో ఏనుగుల దాడిలో వృద్ధుడి మృతి

మన్యం (CLiC2NEWS): జిల్లాలో ఏనుగుల దాడిలో ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. జిల్లాలోని కొమరాడ మండలం వన్నాం గ్రామంలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. అరటి తోటలో ఉన్న ఏనుగుల గుంపును గమనించని శివుడినాయుడు తన దారిలో వెళిపోతున్నాడు. ఏనుగులు ఒక్కసారిగా అతనిపై దాడి చేశాడు. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇటీవల కాలంలో మన్యం జిల్లాలో తరచూ ఏనుగుల దాడులు జరుగుతూనే ఉన్నాయి. పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.