13ఏళ్ల బాలిక ధైర్య‌సాహ‌సాలకు మెచ్చి.. త‌న కంపెనీ ఉద్యోగం ఇస్తాన‌న్న ఆనంద్ మ‌హీంద్రా..

Anand Mahindra: మ‌హేంద్ర గ్రూప్ ఛైర్మ‌న్ ఆనంద్ మ‌హీంద్రా గురించి తెలియ‌ను వారుండ‌రు ఏ విష‌యం త‌కు ఆస‌క్తిగా అనిపించిన వెంట‌నే స్ఫందిస్తారు. అందిరితో పంచుకుంటారు. తాజాగా ఓ 13 ఏళ్ల‌ బాలిక.. అమెజాన్ వ‌ర్చువ‌ల్ వాయిస్ అసిస్టెంట్ అలెక్సా సాయంతో త‌నను, మేన‌కోడ‌ల‌ను సైతం కోతుల బారి నుండి ర‌క్షించుకుంది. సాంకేతిక పరిజ్ఞానానికి యువ‌త బానిసై పోతున్న త‌రుణంలో ఈ బాలిక చేసిన ప‌నికి త‌న విద్యాభ్యాసం పూర్త‌యిన త‌ర్వాత ఎపుడైనా కార్పొరేట్ ప్ర‌పంచంలో ప‌నిచేయాల‌ని నిర్ణ‌యించుకుంటే మ‌హీంద్రా రైజ్‌లో చేర‌మ‌ని ఆహ్వానిస్తున్నామ‌ని పోస్ట్ చేశారు. నెటిజెన్లు ఈ పోస్టుపై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

ఉత్త‌ర్‌ప్ర‌దేశ్ బ‌స్తీ జిల్లాకు చెందిన 13 ఏళ్ల నికిత అనే అమ్మాయి ఓ చిన్న‌పాప( 15 నెల‌లు)తో ఇంట్లో ఆడుకుంటుంది. ఆస‌మ‌యంలో వాన‌రాల గుంపు ఇంట్లోకి చొర‌బడ్డాయి. ఇంట్లో ఉన్న వ‌స్తువుల‌న్నీ ప‌డేస్తూ, ఆహార‌ప‌దార్థాలను తినేస్తున్నాయి. ఓ వాన‌రం నికిత ద‌గ్గ‌ర‌కు వ‌చ్చింది. ఆస‌మ‌యంలో ఆ ఇంట్లో పెద్ద‌వారెవ‌రు లేరు. కానీ ఆ బాలిక భ‌య‌ప‌డ‌క స‌మ‌య‌స్ఫూర్తితో ఆలోచించింది. త‌న‌కు అలెక్సా గుర్తుకొచ్చి.. అలెక్సా శున‌కంలా మొరుగు అని చెప్పింది. అంతే వెంట‌నే కుక్క మొరుగుతున్న‌ట్లు లెక్సా పెద్దగా శ‌బ్ధాలు చేయడంతో కోతులు అక్క‌డి నుండి ఉడాయించాయి.

Leave A Reply

Your email address will not be published.