Nirmal: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి..
నిర్మల్ (CLiC2NEWS): జిల్లాలోని అంగన్వాడీ ఉద్యోగులు నిరవదిక సమ్మె చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్సర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్‌డిఒ కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఉద్యోగుల సమస్యలను తక్షణమే ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. టీచర్లకు రూ. 10 లక్షలు, మిని టీచర్లకు రూ. 5 లక్షల బెనిఫిట్స్ అందజేయాలన్నారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి.. నెలకు రూ.26 వేలు కనీస వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఇంకా జిఒ నెంబర్ 14,19,8 లను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సవరించాలని కోరారు.
మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా అంగన్వాడీ ఉద్యోగులు నేటి నుండి సమ్మె బాట పట్టనున్నట్లు సమాచారం. ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని, టీచర్లకు రూ. 10 లక్షలు, మిని టీచర్లకు రూ. 5 లక్షల బెనిఫిట్స్ అందజేయాలి, ఉద్యోగ విరమణ వయసు 60 ఏళ్లకు పెంచాలి, ప్రమాద బీమా రూ. 5 లక్షలు అమలు చేయాలి, విద్యార్హతలు ఉన్న ఆయాలకు ఉద్యోగోన్నతులు వర్తింపజేయాలనే డిమాండ్లతో వారు సమ్మె బాటపట్టనున్నారు.
[…] […]