నేటి నుండి మరో విడత ఉచిత బియ్యం..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రంలో నేటినుండి మరోవిడత ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు.. మనిషికి 10 కిలోలు చొప్పున ఉచిత బియ్యం పంపణీ చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలల పాటు పిఎంజికెఎవై పథకాన్ని పొడిగించిన విషయం తెలిసినదే..
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 90.01 లక్షల కార్డులు, 283.42 లక్షల లబ్ధిదారులు ఉన్నారు. దీనిలో 54.37 లక్షల కార్డులు, 1.91 కోట్ల మందికి మాత్రమే కేంద్రం నుండి 5 కిలోల చొప్పన ఉచిత రేషన్ అందుతుందని మంత్రి తెలిపారు. మిగిలిన 35.64 లక్షల కార్డులు, 91.72లక్షల మందికి కావలిసిన రేషన్ రాష్ట్ర ప్రభుత్వమే
సరఫరా చేస్తుందన్నారు.