తెలంగాణలో మరో నోటిఫికేషన్ జారీ..

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో టిఎస్పిఎస్సి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమ శాఖలో 23 అధికారి పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 13వ తేదీ నుండి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.