లోన్‌యాప్ వేధింపుల‌కు మ‌రో యువ‌కుడు మృతి

మంచిర్యాల (CLiC2NEWS): అప్పులోళ్లు ఇంటిమీద‌కి వ‌స్తే ప‌రువుపోతుంద‌నుకున్న ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న మంచిర్యాల‌ జిల్లా శ్రీ‌రాంపూర్‌లో చోటుచేసుకుంది. అరుణ‌క్క‌న‌గ‌ర్‌లో శ్రీ‌కాంత్ త‌న భార్య పిల్ల‌ల‌తో నివాసం ఉంటున్నాడు. మూడేళ్ల నుండి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబుడులు పెట్టి న‌ష్ట‌పోయాడు. దీనికోసం తెలిసిన వారిద‌గ్గ‌ర అప్పులు చేయ‌డంతో పాటు రుణ‌యాప్‌ల ద్వారా మ‌రికొంత లోన్ తీసుకొని స్టాక్స్‌లో పెట్టుబ‌డి పెట్టాడు. ఆ డ‌బ్బంతా పోయింది. లోన్‌యాప్ నిర్వాహ‌కులు బెదిరింపులు మొద‌ల‌య్యాయి. దీంతో ప‌రువుపోతుందేమోన‌ని భావించిన శ్రీ‌కాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. శ్రీ‌కాంత్ ఆత్మ‌హ‌త్య‌కు ముందు ఓ సెల్పీ వీడియో తీసుకొని ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. ఎవ‌రిద‌గ్గ‌ర ఎంత అప్పుతీసుకున్న‌ది ఆ వీడియో వివ‌రించాడు. ఆ వీడియో చూసిన వారిని కంట‌త‌డి పెట్టిస్తుంది. పోలీసులు కేసు నమోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.