యాంటిబయాటిక్స్ అతిగా వాడుతున్నారా.. !
ఢిల్లీ (CLiC2NEWS): మనం సాధారణంగా జలుబుకాని, దగ్గుకు గాని యాంటిబయాటిక్స్ వాడుతుంటాం. కాని వీటిని అతిగా వాడొద్దని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సూచించింది. గత రెండు మూడు నెలలుగా అందరిలోనూ జలుబు, దగ్గు కేసులు ఎక్కువవుతున్నాయి. సాదారణంగా దగ్గు 4,5 రోజులలో తగ్గకుండా రెండు, మూడు వారాలు ఉంటుంది. వీటిలో చాలా కేసులు ఇన్‌ప్లుయెంజా ఎ ఉపరకం హెచ్3ఎన్2 వైరస్ కారణమవుతోందని భారత వైద్య పరిశోధన మండలి (ICMR) నిపుణులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా దగ్గు, జలుబు , వికారం కేసులు పెరుగుతన్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ గుర్తించింది. వీటి కోసం యాంటీ బయాటిక్స్ విచక్షణారహితంగా వాడొద్దని సూచించింది. 15 ఏళ్లలోపు వారు, 50 ఏళ్లు పైబడిన వారు ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువని.. వాయుకాలుష్యం కూడా కారణమవుతోందని వెల్లడించింది. ఇన్‌పెక్షన్‌లతో బాధపడేవారికి యాంటీ బయాటిక్స్ కాకుండా రోగ లక్షణాలకు సంబంధించిన వైద్యం అందించాలని.. యాంటీబయాటిక్స్ వాడకాన్ని నిలిపివేయాలని సూచించింది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ అజిత్రోమైసిన్, ఆమోక్సిక్లావ్ వంటి యాంటీబయాటిక్స్‌ను వాడుతున్నట్లు తెలిపింది. ఇవి మితిమీరి వాడటం వలన అవసరమైన సందర్భాల్లో పనిచేయకపోయో ప్రమాదం ఉందని ఐఎంఎ ప్రకటనలో తెలపింది.