అనులోమా విలోమా ప్రాణాయామము

మస్తిష్కంతో సెరిబ్రెల్ తారతమ్యత స్థితి నాస రంద్రాల శ్వాస చక్రం పై ఆధారపడి ఉంటుంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం ఈ తారతమ్యత సింపదటీక్ ఒక పెరా సింపదటిక్ నాడి వ్యవస్థకు చెందిన క్రియ ద్వారా నియంత్రితమవుతుంది. యోగ విజ్ఞాన సిద్ధాంతం నాడీ ద్వారా మస్తిష్కానికి చెందిన రెండు భాగాలు ప్రయోగం అని ఆధారం చేసుకుని ఈ తారతమ్యత ఈడ (పింగళి) నాడలు నియంత్రతం చేస్తుంది. అనులోమా విలోమ ప్రాణాయామంతో రెండింటి క్రియలలోను సపూర్ణంగా సామరస్యతను స్థాపించటం జరుగుతుంది.
ఈ స్థితిలో రెండు నాసా రంద్రాల్లో ఉన్న ప్రాణవాయువు సంతులితం అవుతుంది. అప్పుడు మస్తీష్కంలో నాడి ద్రవాలు ఉచ్ఛ్వాస స్థితిలో సంచరిస్తూ ఉంటాయి. అప్పుడని సుషమ్న కాండం నుంచి మస్తీష్కము వైపుకి స్రవిస్తూ ఉంటాయి. బహిస్రావాలా స్థితిలో మస్తీష్కమ్ నుంచి సుషుమ్న కాండం వైపుకి ప్రవహిస్తాయి. ప్రాణవాయువు ప్రవాహాన్ని సమంగా ఉంచటం వలన మస్తిష్కములో నాడి ద్రవాల ఉచ్వాస స్థితి సౌమ్య స్థితిలో వస్తుంది. ఈ సమ్యత వలన శరీరంలో సమస్త కణాలు కణజాలాలు అవయవాల జీవశక్తి సమంగా పంపిణీ అవుతుంది. అవయవాలకు సంపూర్ణంగా శక్తి లభించాలంటే అదనపు బలం సమకూర్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తకపోతే ఓత్తిడి ప్రశ్న ఉండదు.

ఈ విధంగా అనులోమా విలోమ ప్రాణాయామం వల్ల రక్తంలో కార్బన్డయాక్సైడ్ సాంద్రత నియంత్రించడం కూడా సాధ్యమవుతుంది.
రక్తంలో CO2 సాంద్రత తక్కువ ఉంటే రక్తం బాగా ఆమ్లయుక్తం అయి ప్రాణాంతకమైన జబ్బులు కూడా ఉత్పన్నమవుతాయి. రక్తంలో co2 సరైన మోతాదులో ఉంటే మస్తిష్టంలో న్యూరో పెస్థయిడ్స్ క్రమం తప్పకుండా ఉత్పన్నమవుతాయి.

అనులోమా విలోమ ప్రాణాయామం చేసే విధానము


.
కుడిచేతిని పైకెత్తి కుడిచేతి బొటనివేల ద్వారా గుడి స్వరం పింగళి నాడి అనామిక మరియు మధ్య వేళ్ళతో ఎడమ స్వరాన్ని మూసి ఉంచాలి. అరచేతిని నాసికకు ఎదురుగా కాక కొంచెం పై భాగంలో ఉంచాలి.
ఈడ నాడి వామస్వరం సోమునికి, చంద్ర శక్తికి, శాంతికి ప్రతీక అందువల్ల నాడీ శోధన నిమిత్తం అనులోమా విలోమ ప్రాణయామాన్ని ఎడమ నాసికతో ప్రారంభించాలి. బొటని వ్రేలితో కూడి నాసికను మూసి ఎడమ ముక్కుతో నెమ్మదిగా శ్వాసించాలి. శ్వాసను పూర్తిగా నింపుకొని అనామిక మధ్య వేలితో శ్వాస పూర్తిగా బయటికి వదలాలి. నెమ్మదిగా ఉశ్వాస నిశ్వాస వేగాన్ని, మధ్యస్థ వేగంతో చేస్తూ తరువాత తీవ్రతరం చేయాలి. తీవ్రమైన వేగంతో మొత్తం శక్తిని ఉపయోగించి మళ్లీ స్వాసించటం మళ్లీ విడవడం చేయాలి. మనకు శక్తానుసరంగా నిదానంగా, మధ్యస్థంగా, తీవ్రంగా చేయాలి. శక్తికి మించి చేయరాదు

పూరకము రేచకము వేగంగా చేస్తే ప్రాణ ధ్వని తీవ్రంగా ఉంటుంది. శ్వాస పూర్తిగా బయటికి వదిలేసిన తర్వాత వామ స్వరాన్ని మూసి ఉంచి కుడి ముక్కుతో శ్వాసను తీసుకోవాలి. లోపల శ్వాస నిండిన తర్వాత ఎడమ నాసికతో స్వాసించి కుడి నాసిక తో గాలి తీసుకొని ఎడమనాసికతో గాలిని బయటికి విడుస్తూ చేస్తుండాలి. ఈ కార్యక్రమాన్ని రెండు మూడు సార్లు చేయంగానే అలసట వస్తది. కొంత సమయం విరామం తీసుకుని మరల ఈ అనులోమ విలోమం ప్రాణాయామం చేయవలెను. ఇలా మొదట్లో ఐదు నిమిషాల నుంచి 25 నిమిషాల వరకు ఆగకుండా నిదానంగా చేయటం వలన మూలధర చక్రంలో సన్నిహిత శక్తి జాగృతం అవుతుంది. ఆధునిక యోగ భాషలో దీన్ని కుండలని జాగరణ కూడా అంటారు.
మనం ప్రాణాయామం చేసే సమయంలో ఈడ పింగళి నాడుల్లో శ్వాస ఘర్షణ మందన వలన సుషమ్న నాడి జాగృతిమవుతుందని ధ్యానించాలి. అష్ట చక్రాల నుండి ఈ సహస్రం వరకు ఒక దివ్య జ్యోతి ఉర్ధ్వ ముఖంగా పయనిస్తున్నట్లు భావించాలి. నా శరీరం అంత దివ్యకాంతితో వెలిగిపోతుంది. శరీరం బయట లోపల నిండిన దివ్య శక్తి ప్రేరపించేది గురువే. శక్తి పాత దీక్షతో స్వయంగా నన్ను దీక్షితుని చేయాలి. అనులోమ విలోమా ప్రాణాయామం వలన శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలుగుతాయి. మూలధార చక్రంతో స్వతహగా ఒక వెలుగుని స్ఫురిస్తుంది. కుండలని జాగృతమవుతుంది. ఊర్ధవ్ తేజస్సు కలుగుతుంది. అప్పుడు శక్తిపాత దీక్షలోకి స్వతహాగా వెళ్తారు.

1. ఈ విధంగా ప్రాణాయామం వలన 72 కోట్ల 72 లక్షల పదివేల 210 నాడులు పరి శుద్ధమవుతాయి. అన్ని నాడులు శుద్ధి అవ్వటం వల్ల శరీరం సంపూర్ణమైన ఆరోగ్యంతో శాంతియుతంగా బలిష్టంగా తయారవుతుంది.
2. సంధి వాతం, ఆమవాతం, కీళ్ల నొప్పులు, వాత రోగాలు,మూత్ర రోగాలు, దాతు రోగాలు, శుక్రక్షయము శీత పిత్తాది సమస్త పిత్త రోగాలు జలుబు చలి దీర్ఘకాలంగా బాధపెట్టే సైనస్ ఆస్తమా దగ్గు ట్రాన్సిల్స్ మొదలగున కఫరోగాలు తగ్గిపోతాయి త్రిదోషాలు ఉపశమనిస్తాయి.
3. హృదయ సిరల్లో వచ్చిన అవరోధాలను బ్లాకేజ్ల ను తొలగిస్తాయి ప్రాణయామాన్ని క్రమం తప్పకుండా అభ్యసిస్తే మూడు నుంచి నాలుగు నెలల వరకు కంటిన్యూగా చేస్తే బ్లాకెజిలు ఓపెన్ అవుతాయి. అనేక రోగుల్లో ఈ ఫలితం చూసిన తర్వాతనే దీన్ని చేయటం ప్రారంభించడం జరిగింది.
4. కొలెస్ట్రాల్ ట్రైగ్లీసరాయిడ్స్ హెచ్డిఎల్, లేదా ఎల్డీఎల్ మొదలైన అసంతులిత స్థితిని నివారించబడతాయి.
5. ఎప్పుడు ప్రతికూల వైఖరిలో ఆలోచించేవారు సానుకూల చింత వైపు దృష్టి సారిస్తారు. ఆనందం ఉత్సాహం కలుగుతుంది మనిషికి ఒత్తిడి తగ్గుతుంది.
6. ఈ ప్రాణాయామం వలన మనసు శరీరము ఆలోచనలు సంస్కారాలన్నీ పరిశుద్ధమవుతాయి. శరీర రోగాలన్నీ నివారించబడతాయి మనసు కుదటపడుతుంది. మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది.
7. ప్రాణాయామము 250 నుంచి 500 సార్లు చేస్తే మూలాధార చక్రంలో అదోముఖంగా ఉండే కుండలని శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తుంది. అంటే కుండలిని జాగృతి ప్రక్రియ ప్రారంభమైనట్టే. ఇదే జీవితం పరమానందమయంగా నడవడానికి మూలధారం.

 

-షేక్ బార్ అలీ
యోగాచార్యులు

 

Leave A Reply

Your email address will not be published.