AP : మే 5 నుండి పాక్షిక కర్ఫ్యూ

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో ఎల్లుండి (ఈ నెల 5వ తేదీ) నుండి ఆంక్షలు, పాక్షిక కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ఈరోజు (సోమవారం) ప్రకటించింది. ఉ.6 నుంచి మ.12 వరకు దుకాణాలకు మాత్రం అనుమతిచ్చారు. రెండు వారాల ఈ పాటు కర్ఫ్యూ కొనసాగనుంది. ముఖ్యమంత్రి జగన్ మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని వివరించారు.