AP: ఈనెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు

అమరావతి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రస్తుతం అమలులో ఉన్న కర్ఫ్యూను పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. క‌ర్ఫ్యూను ఈ నెల 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. స‌డ‌లింపును స‌మ‌యాన్ని కూడా పెంచింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఉద‌యం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కర్ఫ్యూ సడలింపు సమయం పెంచారు. మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఇప్ప‌టికే విధించిన క‌ర్ఫ్యూ గ‌డువు 10 వ తేదీతో ముగియ‌నున్న నేప‌త్యంలో సిఎం అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించిన క‌ర్ఫ్యూ పై నిర్ణ‌యం తీసుకున్నారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్‌ జగన్‌.. మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.