AP: కొత్తగా 12,768 కేసులు..

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు ఇవాళ కాస్త పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 98,048 నమూనాలను పరీక్షించగా కొత్తగా 12,768 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రలో మొత్తం 17,17,156 మందికి కరోనా సోకింది.
గడిచిన 24 గంటల్లో 98 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 11,132 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 15,612 మంది రికవరీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 15,62,229కు చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,3795 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 10, పశ్చిమ గోదావరి జిల్లాలో 9, అనంతపూర్ జిల్లాలో 8, తూర్పు గోదావరిలో 8, విజయనగరంలో 8, గుంటూరులో 7, ప్రకాశం జిల్లాలో 7, శ్రీకాకుళం జిల్లాలో 4, విశాఖపట్నం జిల్లాలో 6, కృష్ణ జిల్లాలో 5, కడప జిల్లాలో 4, కర్నూల్ జిల్లాలో 4 చొప్పున మరణించారు.