AP: రాష్ట్రంలో కొత్తగా 14 మెడికల్ కాలేజీలు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైస్ జగన్ రాష్ట్రంలో కొత్తగా 14 మెడికల్ కళాశాలల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు .ఈసందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..ప్రతి పార్లమెంట్ పరిధిలోనూ టీచింగ్ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని, వాటికి అనుబంధంగా నర్శింగ్ కాలేజీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నిర్మాణ పనులు మూడేండ్లలోపు పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించామని అన్నారు. పేదవారికి సైతం మంచి వైద్యం అందించాలనే అత్యాధునిక వసతులతో ఈ కళాశాలల నిర్మాణం చేపట్టామని, ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే వెయ్యి రూపాయలు ఖర్చు దాటిన రోగాలను ఆరోగ్యశ్రీలో చేర్చామని ఆయన గుర్తుచేశారు.