AP: చెరువులో ప‌డి న‌లుగురు మృతి

నెల్లూరు (CLiC2NEWS): నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని ఓజిలి మండ‌లం రాజుపాలెంలో ప్ర‌మాద‌వ‌శాత్తు చెరువులో ప‌డి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలు రాజుపాలెం హైవే వ‌ద్ద కిరాణ దుకాణం న‌డుపుకొంటూ జీవ‌నం సాగిస్తున్నార‌ని తెలిసింది.

చెరువులో చిన్నారులు ప‌డిన విష‌యం గ‌మనించి వారిని కాపాడేందుకు య‌త్నించిన ఖ‌లీల్ (45) అనే వ్య‌క్తి కూడా ఈ ఘ‌ట‌న‌లోమృతి చెందాడు. మృతులు జాహ్న‌వి (12), హేమంత్ (6), చ‌ర‌ణ్‌తేజ (8)గా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave A Reply

Your email address will not be published.