AP: ప్రైవేట్ ఆస్పత్రులకు దీటుగా కోవిడ్ కేర్ సెంటర్

విశాఖపట్నం (CLiC2NEWS): విశాఖ జిల్లాలోని షీలానగర్ లో ఎపి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఈరోజు 300 ఆక్సిజన్ బెడ్లు కలిగిన కోవిడ్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ కోవిడ్ కేర్ సెంటర్‌ను ఎంపీ విజయసాయిరెడ్డి ఏర్పాటు చేశారు.
ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు కురసాల కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎంపీ విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.