AP: `వైఎస్సార్‌ మత్స్యకార భరోసా` నిధులు నేరుగా ల‌బ్థిదారుల‌కు

అమరావతి:ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆన్‌లైన్ విధానంలో ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకం నిధుల‌ను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు జమ చేశారు. ఈ సంద‌ర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలకు అండగా ఉండేందుకే వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాం. 1,19,875 మత్స్యకార కుటుంబాలకు మత్స్యకార భరోసా పథకం అమలు చేస్తున్నాం. అర్హులైన ప్రతి లబ్ధిదారునికీ నేరుగా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. అధికారంలోకి రాగానే 2019లో ఈ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించిన‌ట్లు గుర్తుచేశారు. వ‌రుస‌గా మూడో ఏడాది ఈ నిధులు ఇస్తున్న‌ట్లు చెప్పారు.

Leave A Reply

Your email address will not be published.