మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ‌గా ‘దిశ’ పెట్రోలింగ్ వాహ‌నాలు: సిఎం జ‌గ‌న్‌

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి 163 ‘దిశ’ పెట్రోలింగ్ వాహనాల‌తో పాటు బందోబ‌స్తు స‌మ‌యాల్లో మ‌హిళా పోలీసుల‌కు సౌక‌ర్యంగా ఉండేలా 18 కార‌వాన్‌ల‌ను ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సిఎం మాట్లాడుతూ.. ‘దిశ’ యాప్ ద్వారా ఫిర్యాదు అందిన 10 నిమిషాల్లోపే సాయం అందేలా ప్ర‌య‌త్నం చేస్తున్నామ‌ని చెప్పారు. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితుల్లో మ‌హిళ‌ల‌కు ‘దిశ’ పెట్రోలింగ్ వాహ‌నాలు ర‌క్ష‌ణ ఇస్తాయ‌ని అన్నారు. ఎపిలో 1.16 కోట్ల మంది మ‌హిళ‌లు దిశ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నార‌ని సిఎం తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.