AP Corona: కొత్తగా 15,284 కేసులు.. 106 మరణాలు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 15,284 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,09,105 కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 20,917 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14,00,754 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,98,023 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 106 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 10,328 మంది మృతి చెందారు.
జిల్లాల వారీగా..
తాజా చిత్తూరులో అత్యధికంగా 15 మంది, ప్రకాశం జిల్లాలో 11 మంది, పశ్చిమగోదావరిలో 10 మంది, అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖపట్టణం జిల్లాల్లో 9 మంది, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో 8 మంది శ్రీకాకుళంలో ఏడుగురు, గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఐదుగురు, కడపలో ఒకరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
