AP Corona: కొత్తగా 8,239 కరోనా కేసులు
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 8,239 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఎపిలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,96,122కు చేరింది.
గడిచిన 24 గంటల్లో ఏపీలో 11,135 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటి వరకు ఎపిలో మొత్తం 16,88,198 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 61 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 11,824 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 96,100 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.