AP Corona: తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు

అమరావతి(CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 84,502 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 14,429 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 103మంది కరోనాతో మృతిచెందారు. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,57,986కు చేరింది.
గత 24 గంటల్లో 20,476 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు 14,66,990 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,80,362యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 10,634 మంది కరోనా బారిన పడి ప్రాణాలు వదిలారు.