AP Corona: 19,412 కేసులు.. 61 మరణాలు

అమరావతి (CLiC2NEWS) : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకండ్ వేవ్ కల్లోలమే సృష్టిస్తోంది. రోజు రోజుకి కొవిడ్ బారిన పడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 19,412 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు శనివారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 11,21,102కు పెరిగింది. ఇక గడిచిన 24 గంటల్లో 11,579 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13,07,552 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇక గత 24 గంటల్లో కరోనా బారిన పడి 61 మంది మృతిచెందారు. రాష్ట్రంలో మృతుల సంఖ్య 8,053 దాటింది. తాజాగా కరోనా బారిన విజయనగరంలో ఎనిమిది మంది, విశాఖలో ఏడుగురురు, చిత్తూరులో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఏడుగురు, అనంతపురంలో ఆరుగురు, ప్రకాశంలో ఐదుగురు, కర్నూలులో ఐదుగురు, కృష్ణాలో ఐదుగురు, నెల్లూరులో నలుగురు, గుంటూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మొత్తం 61 మంది మృతి చెందినట్లు తెలిపింది.
ఆయా జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు
అనంతపురం 1722, చిత్తూరులో 2768, ఈస్ట్ గోదావరి -2679, గుంటూరు – 1750, కడప -792, కృష్ణా – 694, కర్నూలు – 1381, నెల్లూరు – 1091, ప్రకాశం – 1106, శ్రీకాకుళం – 2048, విశాఖ – 1722, విజయనగరం – 606, వెస్ట్ గోదావరి – 1053 చొప్పున నమోదయ్యాయి.