AP Corona: 20,345 కేసులు.. 108 మర‌ణాలు

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో ఎపిలో కొత్త‌గా 20,345 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఈ మేర‌కు మంగ‌ళ‌వారం సాయంత్రం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాక క‌రోనా బులిటెన్ విడుద‌ల చేసింది. తాజా కేసుల‌తో క‌లిపి రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 13,20,039 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 11,16,038 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 1,95,102 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో రాష్ట్రంలో క‌రోనాతో 108 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో క‌రోనాతో మృతి చెందిన‌వారి సంఖ్య 8,899 కి చేరింది.

Leave A Reply

Your email address will not be published.