AP Corona: 71 మంది మృతి
అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్ లో గత రెండు రోజులతో పోలిస్తే కరోనా వైరస్ ఉధృతి కాస్త తగ్గినట్టే కనబడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 1,15,275 పరీక్షలు నిర్వహించగా కొత్తగా 18,972 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు సోమవారం సాయంత్ర ఏపీ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను విడుదల చేసింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,63,994 కు చేరింది. వీటిలో 10,03,935 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,51,852 కరోనా కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 71 మంది మృతి చెందారు. తాజా మరణాలతో కలిపి ఇప్పటి వరకు కరోనాతో 8,207 మంది మృతి చెందారు. తాజాగా ఏపీలో 10,227 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని అధికారులు పేర్కొన్నారు.
